ఆమ్ ఆద్మీలో చేరిన అరుంధతీరాయ్ తల్లి
మహిళా హక్కుల కార్యకర్త, బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ తల్లి మేరీ రాయ్ ఆమ్ ఆద్మీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కేరళలోని కొట్టాయంలో ఏఏపీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. రాజకీయాల్లో కొత్తదైన ఆమ్ ఆద్మీ నాణ్యమైన మార్పు తీసుకొస్తుందని భావిస్తున్నట్లు మేరీ రాయ్ పేర్కొన్నారు. ప్రస్తుతమున్న పార్టీలు పాతబడ్డాయని, ఇక మార్పులు తీసుకురాలేవన్నారు. రాజకీయాల్లో మార్పు అనేది ప్రధానమైనది కాబట్టి, ఆప్ దానికోసం పోరాడుతుందని తాను భావిస్తున్నానన్నారు.